శ్రీనగర్‌లో మానవత్వం మరియు సామరస్యంతో ఆటో రిక్షా డైవర్లు అందించిన మద్దతును ఆల్ ఇండియా రోడ్ ట్రాన్‌స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. పెహల్లామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత వారు స్వచ్ఛందంగా పర్యాటకులకు విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్‌లకు ఉచిత రవాణాను అందించారు.
పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం, అత్యంత గర్హనీయం. ఉగ్రవాద చర్యలను తక్షణం అరికట్టాలి. కుల, మతాలకు అతీతంగా మొత్తం జమ్మూ & కాశ్మీర్‌లోని ప్రజలు ఒకే స్వరంతో తీవ్రవాద దాడులను ఖండించారు. పర్యాటకులను రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన గుర్రపు స్వారీ అలీడ్‌కు AIRTWF తీవ్ర విచారం మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది పర్యాటకులను మరో టూరిస్ట్ గైడ్ నజాక్ వీరోచితంగా రక్షించాడు. మరొక సంఘటనలో ముసాఫిర్ మరియు సమీర్ టాక్సీ డ్రైవర్లు ఉగ్రవాదుల కాల్పుల్లో తన తండ్రిని కోల్పోయిన కేరళకు చెందిన శ్రీమతి ఆరతీ మీనన్‌కు అన్ని లాంఛనాలు పూర్తయి, విమానాశ్రయానికి చేరుకునే వరకు సహాయం చేసారు. శ్రీమతి ఆరతి మీనన్ వారిని తన సోదరులుగా అభివర్ణించారు. ఇలాంటి ఎన్నో వార్తలు వస్తున్నాయి… ఆ హీరోలందరికీ AIRTWF సెల్యూట్‌లు.
వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని చోట్ల ఛాందసవాదులు పెహల్లామ్ దాడి పేరుతో ముస్లింలను అమానుషంగా వేధిస్తున్నారు. అలాంటి చర్యలను AIRTWF తీవ్రంగా ఖండిస్తున్నది. శాంతి, సామరస్యాన్ని కాపాడాలని ప్రజలందరికీ AIRTWF విజ్ఞప్తి చేస్తుంది.
R. Lakshmaiah
ప్రధాన కార్యదర్శి